Thursday 13 February 2020

ఆధునిక, సాంకేతిక యుగం - Technological Era - 3 D ప్రింటర్స్ - ఎలక్ట్రానిక్స్ సూత్రాలు - Hardware - Software


ఆధునిక, సాంకేతిక యుగం


మనము ఎలా ఆలోచిస్తున్నాము అన్నది ముఖ్యము కాదు. మనము ఎలా ఉన్నాము అన్నది ఈ ఆధునిక ప్రపంచములో చాలా అవసరము. నువ్వు ఎలా ఉన్నావు అన్నది నిర్ణయించడానికి కొన్నిగుణాలు, లక్షణాలు ఉంటాయి. ఇవి శారీరిక, మానసిక, ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించి ఉంటాయి. జీవ శాస్త్రవేత్తలు మరియు లైఫ్ సైన్సు మేధావులు శరీరము యొక్క పటాన్ని ఏనాడో చిత్రించారు.

వీరు అన్వేషించే విషయాలు ఎన్నో ఉంటాయి. చర్మపు బాహ్య పొర నుంచి అంతరాంతర కేంద్రకాలు మరియు జన్యువుల వరకు విస్తరించి ఉంటాయి. కాని మనుష్యులను ఒక అణు సమూహముగా చిత్రించడం వెఱ్రి కిందే లెక్ఖ. ఈ పద్ధతిని తగ్గింపు వాదం లేక రిడక్షన్ ism అంటారు.

రిడక్షన్ ism గురించి మాట్లాడేటప్పుడు, దాని వ్యతిరేక వాదమైన సంక్లిష్ట వాదం ప్రస్తావన కుడా వస్తుంది. సంక్లిష్టత జీవితాన్నిఎన్నో విధాలుగా వృద్ధి చేస్తుంది. ఈ సంక్లిష్టతను అర్థం చేసుకోలేని వారు దీనిని ఒక శాపములా భావిస్తారు. అజ్ఞానము, అవగాహనలోపము పురోగతికి ఒక గొప్ప అవరోధము.

బాహ్య ప్రపంచములో రణగొణ ధ్వనులు, అతి జనాభా ఎక్కువ అయ్యాయి. శాస్త్ర, సాంకేతిక అభివృద్ధి ఎన్నో నూతన యంత్రాలను ఆవిష్కరించాయి. ఈ యంత్రాలలో ప్రింటర్, ఫోటోకాపీయర్ వంటి స్థూల వస్తువులు ఉంటాయి. సాఫ్ట్వేర్, కంప్యూటర్ ప్రోగ్రామ్స్ వంటి నైరుప్య(ఆబ్స్ట్రాక్ట్) వనరులు కూడా ఉంటాయి.

పారిశ్రామిక యుగానికి, సాంకేతిక యుగానికి తేడాని నిర్ణయించేది ఎలక్ట్రానిక్స్ మాత్రమే. విద్యుత్ శక్తి యాంత్రిక పరికరాలైన క్రేనస్, ట్రక్స్ లను కదిలిస్తాయి. వీటి సహాయముతో కొండలనే కదిలించవచ్చు. ఎలక్ట్రానిక్ భాగాలూ, కంపూటర్లు కూడా పారిశ్రామిక యుగము యొక్క పరిణామాలే. కానీ వాటికీ, ఇతర యంత్రాలకి కొన్ని ఆసక్తికరమైన, నిర్దిష్టమైన వ్యత్యాసాలు ఉన్నాయి.

ఎలక్ట్రానిక్స్ సూత్రాలు మరియు సాఫ్ట్వేర్ చాలా అభివృద్ధి చెంది కొత్త ఆధునికతను, యుక్తిని పొందాయి. కంప్యూటర్లను, ఎలక్ట్రానిక్ పరికరాలను అంతర్జాలముతో అనుసంధానించవచ్చు. వీటిలోని సర్క్యూట్లు, చిప్పులు, ఇంకా ఇతర హార్డువేర్,విద్యుత్ శక్తి తో పని చేస్తాయి. కాకపోతే వీటిలో ప్రవహించే విద్యుత్తే కొత్త రకమైన మాయను సృష్టిస్తోంది. ప్రోగ్రామ్స్, సాఫ్ట్వేర్ కేవలం సున్నాల, ఒకట్ల క్రమము మాత్రమే కాదు - అవి అర్థవంతమైనవి, తార్కికమైనవి మరియు ఉత్పాదకతను పెంపొందిoచేవి కూడా.

ఇప్పుడు ప్రపంచము సాఫ్ట్వేర్ ఉత్పత్తులు, టూల్స్, వేదికలు, మరియు అప్లికేషన్స్ తో సుసంపన్నమైనవి. ఇవి హార్డువేర్, యంత్రాలవలె స్థూల వస్తువులు కావు. ఇవి డేటా, సమాచారము, ఇంకా కోడ్ యొక్క నైరుప్య సేకరణలు(abstract కలెక్షన్స్). ఐతే, సాఫ్ట్వేర్ రెండు విభిన్న స్థితులలో మనుగడ కొనసాగిస్తాయి.
1.      ఒకటి స్థిరమైన స్థితి - హార్డ్ డిస్క్ లాంటి భౌతిక మాధ్యమములో పొందుపరచడము
2.      రెండు డైనమిక్ స్థితి - కంప్యూటర్ మెమరీ లోని ప్రోగ్రామ్స్, డేటా మరియు వాటి మీద చేయబడే ప్రాసెసింగ్(ఇది మైక్రోప్రాసెసర్ అనబడే భౌతిక వస్తువుతో చేయబడుతుంది)

కాబట్టి, హార్డువేర్ మరియు భౌతిక మాధ్యమాలు ఎక్కడ అంతమై, నైరుప్య పధ్ధతి ఎక్కడ మొదలౌతుందో చెప్పడం చాలా కష్టం. హార్డువేర్, సాఫ్ట్వేర్ల వ్యత్యాసాన్ని జ్ఞానేంద్రియాల ద్వారా గుర్తించవచ్చు. స్థూలమైన పరికరాలను మనము చూడొచ్చు, ముట్టుకోవచ్చు, వాటి వాసన పసిగట్టవచ్చు. సాఫ్ట్వేర్ దీనికి విరుద్ధమైనది. దానిని మనము కంటితో చూడలేము. కేవలము దాని యొక్క ప్రభావాలను ఔట్పుట్, డేటా, ఫలితాల రూపములో చూడొచ్చు.

కాకపోతే ఇప్పుడు బాగా అభివృద్ధి చెందిన 3 D ప్రింటర్స్ వచ్చేసాయి.  వీటిని సంకలిత తయారీ పరికరాలు లేక additive manufacturing devices అంటారు. ఈ సాధనాలను కంప్యూటర్స్ తో కనెక్ట్ చేసి రకరకాల నూతన వస్తువులను తయారీ చెయ్యొచ్చు. ఈ వస్తువులకు రకరకాల పరిమాణాలు, ఆకారాలు, రంగులు ఇవ్వొచ్చు
ఈ 3 D ప్రింటర్ లేక తయారీ పరికరము, కంప్యూటర్ నుంచే ఆదేశాలను స్వీకరిస్తుoది. పరిజ్ఞానము ఉన్నవాళ్లు కంప్యూటర్ లోనే నూతన వస్తువుల నమూనాల రూపకల్పన చేస్తారు. 3 D ప్రింటర్ పొరలు పొరలుగా భౌతిక పదార్థాన్నిజోడించి ఆ నమునాకు జీవం పోస్తుంది.

తత్త్వశాస్త్ర దృష్టితో చూస్తే, జీవితము, పథార్థ క్షేత్రములో,  ఒక ప్రదక్షిణ పూర్తి చేసినట్టే.  పథార్థము తో నిర్మించిన వస్తువులను (కంప్యూటర్స్) ఉపయోగించి, అధునాతన వస్తువులను సృష్టించడం జరుగుతోంది. తయారీ ప్రక్రియలో మానవ పాత్ర కుచించుకు పోయింది.

ఈ యుగాన్ని, ఈ అభివృద్ధి పథాన్ని రకరకాల పేర్లుతో పిలుస్తున్నారు. 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పోస్ట్-ఇండస్ట్రియల్ సొసైటీ, knowledge(జ్ఞానవంతమైన) ఎకానమీ, డేటా-driven డెవలప్మెంట్, Internet అఫ్ Things (IoT) etc.,   


No comments:

Post a Comment