Wednesday 12 February 2020

Knowledge Economy - జ్ఞానవంతమైన ఆర్థికవ్యవస్థ - జ్ఞానముతో కూడిన సామాజిక ఆర్థిక వ్యవస్థ


జ్ఞానవంతమైన ఆర్థికవ్యవస్థ (Knowledge Economy)

ప్రపంచీకరణ మరియు అర్థిక పురోగతి ఒక నవీన ప్రపంచాన్నిఆవిష్కరిస్తోంది. కంప్యూటర్లు రాక ముందు, పెద్ద, పెద్ద పరిశ్రమల ప్రభావము ఎక్కువగా ఉండేది. సాఫ్ట్వేర్ అవిర్భావముతో చిన్న మరియు మధ్య స్థాయి పరిశ్రమలు కూడా విస్తరించాయి. ఇప్పుడు సాంకేతిక, సమాచార విప్లవాలు ఒక నూతన జ్ఞానవంతమైన ఆర్థిక వ్యవస్థను ప్రేరేపిస్తున్నై.

ఈ జ్ఞానవంతమైన ఆర్థిక వ్యవస్థను మూడు విభాగాలుగా గుర్తించవచ్చు - 
1.      సాంకేతిక పరమైన ఆర్థిక వ్యవస్థ
2.      జ్ఞానవంతమైన ఆర్థిక వ్యవస్థ
3.      జ్ఞానముతో కూడిన సామాజిక ఆర్థిక వ్యవస్థ

సాంకేతిక పరమైన ఆర్థిక వ్యవస్థ


ఈ వ్యవస్థలోని సంస్థలు సమాచార మరియు కమ్యూనికేషన్స్ సాంకేతికతపై (ICT) ఆధారపడి ఉన్నాయి. ఇందులో ఇంటర్నెట్, మొబైల్ టెలిఫోనీ, కంప్యూటర్స్, మరియు సాఫ్ట్వేర్ ల ప్రభావముఎక్కువగా కనపడుతుంది. సాంకేతిక వ్యవస్థాపకులు మరియు వ్యాపారులు, ICT ని ఉపయోగించి సమస్యలకు సమాధానాలు కనుక్కొంటారు. 
వీరు నాలుగు ముఖ్యమైన పనులు చేస్తారు -
  • 1      నూతనంగా ఉద్భవిస్తున్నసాంకేతికతలను(emerging టెక్నాలజీస్) వ్యాపార దృకపధంతో ఉపయోగించుకోవడము.
  • 2      నవీకరణ ద్వారా సాంకేతిక మార్పులను ప్రేరేపించడము.
  • 3      ఊహశాక్తితో సాంకేతిక పరమైన ప్రక్రియలను, వ్యాపార నమూనాలనుప్రయోగించి మార్కెట్ అవకాశాలను చేజిక్కించుకోవడము.
  • 4      నూతన సాంకేతిక వ్యవస్థలను, వ్యాపారాలను పకడ్బందిగా ఏర్పాటు చేసుకోవడము.
జ్ఞానవంతమైన ఆర్థిక వ్యవస్థ

డేటా మరియు సమాచారాన్నిశక్తివంతమైన జ్ఞానముగా మార్చగలిగే వ్యవస్థలదే భవిష్యత్తు. నవీన వ్యవస్థాపకుల మేధస్సే ఇందులో ముఖ్య పెట్టుబడి. సాంకేతిక పరమైన ఆర్థిక వ్యవస్థ సమాచారాన్నిసృష్టిస్తే, ఈ వ్యవస్థ ఆ సమాచారాన్నించి ఉపయోగకరమైన జ్ఞానాన్నిసృష్టిస్తుంది. సాంకేతిక పరమైన ఆర్థిక వ్యవస్థ, జ్ఞానవంతమైన ఆర్థిక వ్యవస్థలో ఒక భాగము మాత్రమే.

ఇందులో వ్యవస్థాపకులు, మానవ మూలధనాన్ని మరియు ICTని తెలివిగా ఉపయోగించుకొని లబ్ధి పొందుతారు. ఎన్ని పరికరాలు, యంత్రాలు, సాంకేతికాలు ఉన్నా, మానవ మేధస్సులేనిదే గొప్ప విజయాలు సాధించడము సాధ్యము కాదు. ఈ వ్యవస్థలో ఆలోచనలు,సమాచారము, మరియు జ్ఞానము సమ్మిళితమై ఉంటాయి.

ఈ వ్యవస్థ విజయము సాధించాలంటే, అధునాతనమైన మరియు మౌలికమైన సదుపాయాలు ఏంతో అవసరము. వీటిలో టెలికాం మరియు సమాచార వ్యవస్థల (Information System) పాత్ర ముఖ్యమైనది. వీటికి తోడు కొన్ని ముఖ్యమైన ఆవిష్కరణల పాత్ర కూడా చెప్పుకో తగ్గది. అవి కృత్రిమ మేధస్సు(AI), రోబోటిక్స్, అంతర్జాలము, ఇఒటి(I o T), బ్లోక్చైన్, క్వాంటమ్ కంప్యూటింగ్, 3D ప్రింటింగ్, 5జి కమ్యూనికేషన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, etc.  

జ్ఞానముతో కూడిన సామాజిక ఆర్థిక వ్యవస్థ

ఆర్ధికాభివృద్ధి సమాజములోని సమస్యలను తీర్చలేదని తేలిపోయింది. పేదరికము, పర్యావరణ కాలుష్యము, పేలవమైన విద్యా వ్యవస్థ, నిరుద్యోగము, ఇలా చెప్పుకుంటూపొతే చాలా సమస్యలే ఉన్నాయి. సాంకేతిక అభివృద్ధి, డిజిటల్ విభజనను (digital divide) కూడా పెంచి పోషించింది. ఈ పరిస్థితులలో కేవలము సమాచారము మరియు సాంకేతికత మాత్రమే సరిపోవు. జ్ఞానముతో కూడిన సమాజాన్ని ఆవిష్కరించడమే ఈ ఆర్థిక వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యము.

జ్ఞానవంతమైన ఆర్థిక వ్యవస్థ వ్యాపారులకు కేంద్రమైతే, జ్ఞానముతో కూడిన సామాజిక ఆర్థిక వ్యవస్థ సమాజ సేవకులకు, ప్రభుత్వాలకు ఉపయోగపడుతాయి. ప్రభుత్వేతర సంస్థలు(NGOs) కూడా ఈ వ్యవస్థలో ముఖ్య పాత్ర నిర్వహిస్తాయి. సామజిక వ్యవస్థాపకులు(social entrepreneurs) ఈ వ్యవస్థకు పట్టుకొమ్మగా నిలుస్తారు.


No comments:

Post a Comment