Sunday 16 February 2020

Philosophy of Computer Science - కంప్యూటర్ సైన్సు - కంప్యూటర్ తత్త్వశాస్త్రము


కంప్యూటర్ సైన్సు ఒక విశాలమైన విద్యాంశము. సైద్ధాంతిక పరముగా ఇది గణిత శాస్త్రానికి చాలా దగ్గరైనది. సాఫ్ట్వేర్ అభివృద్ధి పరముగామాత్రం ఇది ఇంజనీరింగ్ కార్యకలాపాలకు దగ్గరైన అంశము. కంప్యూటర్ సైన్సుకు మనస్తత్వ శాస్త్రానికి, జ్ఞానపరమైన శాస్త్రానికి(cognitive సైన్సు) చాలా దగ్గర సంబంధము ఉంది. భౌతిక శాస్త్రములో, ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్సు అప్లికేషన్స్ విరివిగా కనపడుతాయి.

కంప్యూటర్ తత్త్వశాస్త్రము మాత్రము కంప్యూటర్ సైన్సు యొక్క ప్రకృతిని, దానినుంచి ఉద్భవించే సంభావిత సమస్యలను క్షుణ్ణముగా పరీక్షిoచి, సమాధానాలను కనుక్కొంటుంది. ఇది విస్తృతమైన అంశాలను, విషయాలను అవగాహన చేసుకొనడానికి ప్రయత్నము చేస్తుంది -
కంప్యూటర్ సైన్సు ఏ విధమైన శాస్త్రము?
ఈ శాస్త్రములో ప్రయోగాల మరియు రూపకల్పనల పాత్ర ఏమిటి?
ఈ శాస్త్రములో గణితము ఏ విధమైన పాత్ర పోషిస్తుంది?
కంప్యూటర్ సైన్సు లో సవ్యత, ప్రమాణాలు ఏమి నిరుపిస్తాయి?

ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను కనుక్కోనటానికి కంప్యూటర్ సైన్సు తత్త్వశాస్త్రము ప్రయత్నిస్తుంది. ఒక విశాల దృక్పధముతో అనేక అంశాలను పర్యావలోకనము చేస్తుంది.


మార్క్సిస్ట్ సిద్ధాంతాలకు తిలోదకాలు
ఒక భారతీయ మేధావి ప్రకారము సమాజము మరియు సాంకేతిక పరిజ్ఞానమునకు సంబంధించిన మూడు అంశాలవలన మార్క్సిస్ట్ సిద్ధాంతాలకు కాలం చెల్లింది. అవి -
1.      computability లేక గణన శక్తి
2.      కాంప్లెక్సిటీ లేక (సామజిక) సంక్లిష్టత
3.      concurrency లేక వైజ్ఞానిక పరమైన (ఉభయ) అనుకూలత

గణితము, భౌతిక శాస్త్రము, మరియు కంట్రోల్ ఇంజనీరింగ్ సూత్రాలను విజయవంతముగా ప్రయోగము చేయడముతో యాంత్రిక విధానాలకు ఒక దిశా నిర్దేశం జరిగింది. శబ్ద, ఎలక్ట్రిక్ తరంగాలను లోబరచుకొని కమ్యూనికేషన్ పరికరాలను తాయారు చేయడం మొదలుపెట్టారు. సమాచార సిద్ధాంతాన్ని, కమ్యూనికేషన్స్ ను మెళకువగా ముడివేసి కోడింగ్ పరికరాలను, కంప్యూటర్ లను కనుక్కొన్నారు.

మానసిక శాస్త్రము కూడా మనుషులను సాంకేతికతకు లోబడి ప్రవర్తించే జీవులుగా నిర్వచించడానికి ప్రయత్నము చేస్తోంది. ఐరోపా మేధావులు నిత్య కార్యకలాపాలను దృగ్విషయ విశ్లేషణకు గురిచేసారు. మానవ అభివృద్ధి సిద్ధాంతాలను క్షుణ్ణముగా పరీక్షించారు. సామాజిక వాస్తవికతను interactions(సంకర్షణ లేక పరస్పరత) నిర్మిస్తాయి అని నిరూపించే ప్రయత్నము చేసారు.

ప్రస్తుతము,
Bigdata(పెద్ద డేటా) తో  computability లేక గణన శక్తిని
AI(కృత్రిమ మేధస్సు) తో కాంప్లెక్సిటీ లేక (సామజిక) సంక్లిష్టతను
Cloud మరియు Parallel కంప్యూటింగ్ తో concurrency లేక వైజ్ఞానిక పరమైన (ఉభయ) అనుకూలతను
అధిగమించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.


No comments:

Post a Comment