Wednesday 19 February 2020

ఆన్లైన్ మార్కెటింగ్నే -వెబ్ మార్కెటింగ్-ఈ-మార్కెటింగ్-SEO - SEM- Digital Marketing - Web Marketing -


SEO - SEM- ఆన్లైన్ మార్కెటింగ్ - వెబ్ మార్కెటింగ్

ఇంటర్నెట్ మరియు వరల్డ్ వైడ్ వెబ్ నూతన ఆవిష్కరణలకు, అభివృద్ధి మార్గాలకు మార్గం సుగమము చేసాయి. ఇవి మార్కెటింగ్ మరియు ప్రకటనల రంగంపై కూడా ప్రభావము చూపాయి. ఎన్నో కంపెనీలు ఇంటర్నెట్లో వెబ్సైటులను ప్రారంభించాయి. వారి సరుకులను, సేవలను వెబ్ ద్వారా అందించడం మొదలు పెట్టాయి. దీనితో సరికొత్త మార్కెటింగ్ పద్ధతులు మొదలైయ్యాయి.

ఆన్లైన్ మార్కెటింగ్నే వెబ్ మార్కెటింగ్ అని, ఈ-మార్కెటింగ్ అని వ్యవహరిస్తారు. ఇందులో ఇంటర్నెట్ వనరులను ఉపయోగించి వినియోగదారులను ఆకర్షిస్తారు. తమ అమ్మకాలను, లాభాలను మెరుగు పరచుకొంటారు. ఇందుకు డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్స్ అనేక పద్ధతులను ప్రయోగిస్తారు. వీటిలో ముఖ్యమైనవి -

1.      SEO లేక సెర్చ్ ఇంజిన్ సర్వోత్తమీకరణ
2.      SEM లేక సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్
3.      ఈమెయిలు మార్కెటింగ్
4.      సోషల్ మీడియా మార్కెటింగ్
5.      ఆన్లైన్ పరపతి/కీర్తి నిర్వహణ
6.      వెబ్ అనలిటిక్స్
to be continued...

Tuesday 18 February 2020

నగ్న సత్యాలు - Real Facts - Truth - నమ్మలేని నిజాలు - ముఖ్యమైన వాస్తవాలు

నగ్న సత్యాలు - నమ్మలేని నిజాలు - ముఖ్యమైన వాస్తవాలు
1.      అతి పురాతన సంస్కృతి, నాగరికతలు భారత భూమిలో వెలిసాయి.
2.      సరస్వతి నదీ తీరాన వెలసిన సంస్కృతి, సింధు నాగరికతకంటే పురాతనమైనది.
3.      యుగాలు గడచిన కొద్దీ సంస్కృతి క్షీణిస్తుంది. నాగరికతలలో మార్పులు వస్తాయి.
4.      పురాణాలలోకూడా చరిత్ర మిళితమై ఉంటుంది. అందుకే భౌగోళిక ప్రదేశాలను ప్రస్తావిస్తారు.
5.      ఇక ఇతిహాసానికి వస్తే అది వాస్తవ సంఘటనల సమాహారం.
6.      చరిత్రను వక్రీకరించడం కలియుగ రాజ్యాధికార లక్షణము.
7.      సరస్వతీ నాగరికతను అత్యాధునిక ఉపగ్రహ చిత్రాలద్వారా నిరూపించవచ్చు.
8.      ఇతిహాసాలలో వర్ణించిన భౌగోళిక ప్రదేశాలను కూడా మ్యాప్ చేయవచ్చు.
9.      పాశ్చ్యాత్యులు ప్రవచించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతము తప్పుడు ప్రచారము.
10.   విజయవంతమైన పాశ్చ్యాత్య సామ్రాజ్యాలకు ఓడినవారిని కించపరచడం ఒక ఆనవాయతి.

11.   ఐరోపా సామ్రాజ్యాలు క్రైస్తవ మత బోధనలకు అనుకూలముగా ప్రవర్తించేవి.
12.   క్రైస్తవములో(కాథలిక్) డాక్త్రిన్ అఫ్ డిస్కవరీ లేక ఆవిష్కరణ సిద్ధాంతము అని ఉంటుంది.
13.    ఆవిష్కరణ సిద్ధాంతము వలసరాజ్యాలను, ఆక్రమణలను సమర్థిస్తుoది.
14.   ఆక్రమించబడిన ప్రాంతాలలోని వస్తువులేకాదు, విద్య విజ్ఞానము కూడా ఆక్రమదారుని సొత్తే.
15.   పోర్తుగల్, జర్మన్, బ్రిటిష్ పెత్తనము వలన భారతీయ ఆవిష్కరణలు ఐరోపాకు ఆపాదించబడ్డాయి.
16.   పరాయిపాలన భారత సంస్కృతికి విరుద్ధమైన ఎన్నో పద్ధతులను, ప్రక్రియలను ఇక్కడ ప్రవేశపెట్టింది.
17.   ఆధునిక విజ్ఞానము, సాంకేతిక పద్ధతులు కలన గణితము(కాల్కులస్) వలన సాధ్యమైనాయి.
18.   కలన గణితాన్నిఐరోపాకు చెందిన న్యూటన్, లేఇబ్నిజ్ కనుగొన్నారని పుస్తకాలలో ఉంటుంది.
19.   వాస్తవానికి కలన గణితాన్నికనుగొన్నది కేరళ లోని సంగామగ్రామానికి చెందిన మాధవుడు.
20.   మాధవుడు అనంతాన్ని(infinity) గురించి, శ్రీనివాస రామానుజన్ కంటే ముందే ఆలోచన చేసాడు.




Monday 17 February 2020

Smart Cities - Benefits - అత్యాధునిక స్మార్ట్ సిటీలు - లాభాలు

అత్యాధునిక స్మార్ట్ సిటీలు మరియు వాటి లాభాలు

పారిశ్రామిక విప్లవము ప్రపంచాన్ని మార్చేసింది. ఇంజిన్స్ నుంచి ఎలక్ట్రానిక్స్ దాక ఒక మెట్టు ముందుకు వేసింది. ఇప్పుడు ప్రాచుర్యములో ఉన్నా పదాలు బిగ్ డేటా, ఇంటర్నెట్ అఫ్ థింగ్స్, కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, etc., ఈ పరిస్థితులలో, స్మార్ట్ సిటీ ల నిర్మాణం సుసాధ్యము.

స్మార్ట్ సిటీలలో, అంతర్జాలాన్ని, విద్యుత్ అనుసంధాన వ్యవస్థని, నెట్వర్క్ సేన్సోర్స్ తో తెలివిగా కనెక్ట్ చేస్తారు. ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ లో సేన్సోర్స్ మాత్రమే కాదు, ఆక్టువేటర్స్ అనే పరికరాలను కూడా వాడతారు. ఈ వ్యవస్థలో మనుషుల పాత్ర తక్కువ, స్మార్ట్ పరికరాల పాత్ర ఎక్కువగా ఉంటుంది.

స్మార్ట్ సేన్సోర్స్ ఉన్నా పరికరాలు చుట్టూ ఉన్నా వాతావరణాన్నిoచి డేటా ని గ్రహిస్తాయి. ఇవి పరిసరాలను కొలత చేసి రికార్డు చేయకలుగుతాయి. ఆక్టువేటర్స్ అనబడే పరికరాలు పరిసరాలను నియంత్రించి, మార్చ కలుగుతాయి.

ఉదాహరణకు, ఒక సెక్యూరిటీ సిస్టం అలికిడి, కదలికలను పసిగట్టి, కెమెరాతో పరిసరాలను బంధిస్తాయి. ఈ కెమెరాల్లోని ఆక్టువేటర్స్, కెమెరాని చుట్టూ కదిల్చి, జూమ్ చేయకలుగుతుంది. దీనితో స్పష్టమైన ఫోటోలు, వీడియోలను అంతర్జాలములో నిల్వపరచవచ్చు. నిల్వపరచిన ఈ డేటాను అధ్యయనము చేసి, విశ్లేషించి, భద్రతను మరింత పెంచవచ్చు.

నగర స్థాయిలో భద్రతనే కాదు, ట్రాఫిక్ ని కూడా నియంత్రిoచ వచ్చు. నీటిసరఫరా, డ్రైనేజి, కరెంటు సరఫరా వ్యవస్థలను కూడా తెలివిగా నడపవచ్చు. ఎలక్ట్రానిక్ పరికరాలు, వైఫై రౌటర్లు, కంప్యూటర్ సర్వర్లు, స్మార్ట్ పరికరాలు, మరియు అంతర్జాల నెట్వర్క్లు దీనికి సహకరిస్తాయి.

ఆధునీకరించిన నగర వ్యవస్థలనుంచి డేటా సేకరించి, అంతర్జాలము ద్వారా సర్వర్లలో నిల్వచేస్తారు.

స్మార్ట్ సిటీ రకాలు
సాంకేతికంగా చుస్తే రెండురకాల స్మార్ట్ సిటీలు ఉంటాయి. ఒక నూతన నగరాన్నిపునాదులనించి నిర్మిస్తే దానిని గ్రీన్ ఫీల్డ్ సిటీ అంటారు. ఉన్నా నగరాన్ని ఆధునీకరించి, సాంకేతికతని జోడిస్తే దానిని బ్రౌన్ఫీల్డ్ సిటీ అంటారు. ఈ రంగము లోని అనుభవజ్ఞులు రెండింటిని స్మార్ట్ సిటీస్ అనే పిలుస్తారు.

నోట్: కొందరు నిపుణులు మూడవ రకమైన నాన్-సిటీ ని కూడా వ్యవహరిస్తారు. దీనికి మంచి ఉదాహరణ సౌదీ జాతీయ ఆయిల్ కంపెనీ అయిన అరంకో. ఈ సంస్థ లోని ఉద్యోగుల భద్రత, ఆరోగ్యము, మరియు విద్యా సదుపాయాలకు హామీ ఉంటుంది.

స్మార్ట్ సిటీల వలన లాభాలు

స్మార్ట్ సిటీలు పౌరులకు చక్కని సేవలు అందిస్తాయి. గృహ సంపద, వ్యాపార సంస్థలు ఉన్నతమైన సాంకేతికత వలన లబ్ధి పొందుతాయి. కనెక్ట్ చేయబడిన నెట్వర్క్లు సమాచారాన్ని, కమ్యూనికేషన్స్ ని ఉపయోగించి అత్యంత ప్రభావవంతమైన సేవలను అందిస్తాయి. స్మార్ట్ సిటీస్ వలన పౌరులకు లభించే కొన్ని లాభాలు -
  1. బిగ్ డేటా మెళకువలు
  2. సమర్థవంతమైన పరిపాలన
  3. సురక్షితమైన సంఘము
  4. పర్యావరణానికి అనుకూలమైన వనరులు
  5. సులభమైన రవాణా వ్యవస్థ
  6. డిజిటల్ ఈక్విటీ
  7. సరికొత్త ఉద్యోగ అవకాశాలు
  8. ఉన్నతమైన ప్రజా వినియోగాలు
  9. ఉన్నత ప్రమాణాలు కలిగిన మౌలిక వసతులు
  10. మెరుగైన శ్రామిక వర్గము

Sunday 16 February 2020

Philosophy of Computer Science - కంప్యూటర్ సైన్సు - కంప్యూటర్ తత్త్వశాస్త్రము


కంప్యూటర్ సైన్సు ఒక విశాలమైన విద్యాంశము. సైద్ధాంతిక పరముగా ఇది గణిత శాస్త్రానికి చాలా దగ్గరైనది. సాఫ్ట్వేర్ అభివృద్ధి పరముగామాత్రం ఇది ఇంజనీరింగ్ కార్యకలాపాలకు దగ్గరైన అంశము. కంప్యూటర్ సైన్సుకు మనస్తత్వ శాస్త్రానికి, జ్ఞానపరమైన శాస్త్రానికి(cognitive సైన్సు) చాలా దగ్గర సంబంధము ఉంది. భౌతిక శాస్త్రములో, ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్సు అప్లికేషన్స్ విరివిగా కనపడుతాయి.

కంప్యూటర్ తత్త్వశాస్త్రము మాత్రము కంప్యూటర్ సైన్సు యొక్క ప్రకృతిని, దానినుంచి ఉద్భవించే సంభావిత సమస్యలను క్షుణ్ణముగా పరీక్షిoచి, సమాధానాలను కనుక్కొంటుంది. ఇది విస్తృతమైన అంశాలను, విషయాలను అవగాహన చేసుకొనడానికి ప్రయత్నము చేస్తుంది -
కంప్యూటర్ సైన్సు ఏ విధమైన శాస్త్రము?
ఈ శాస్త్రములో ప్రయోగాల మరియు రూపకల్పనల పాత్ర ఏమిటి?
ఈ శాస్త్రములో గణితము ఏ విధమైన పాత్ర పోషిస్తుంది?
కంప్యూటర్ సైన్సు లో సవ్యత, ప్రమాణాలు ఏమి నిరుపిస్తాయి?

ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను కనుక్కోనటానికి కంప్యూటర్ సైన్సు తత్త్వశాస్త్రము ప్రయత్నిస్తుంది. ఒక విశాల దృక్పధముతో అనేక అంశాలను పర్యావలోకనము చేస్తుంది.


మార్క్సిస్ట్ సిద్ధాంతాలకు తిలోదకాలు
ఒక భారతీయ మేధావి ప్రకారము సమాజము మరియు సాంకేతిక పరిజ్ఞానమునకు సంబంధించిన మూడు అంశాలవలన మార్క్సిస్ట్ సిద్ధాంతాలకు కాలం చెల్లింది. అవి -
1.      computability లేక గణన శక్తి
2.      కాంప్లెక్సిటీ లేక (సామజిక) సంక్లిష్టత
3.      concurrency లేక వైజ్ఞానిక పరమైన (ఉభయ) అనుకూలత

గణితము, భౌతిక శాస్త్రము, మరియు కంట్రోల్ ఇంజనీరింగ్ సూత్రాలను విజయవంతముగా ప్రయోగము చేయడముతో యాంత్రిక విధానాలకు ఒక దిశా నిర్దేశం జరిగింది. శబ్ద, ఎలక్ట్రిక్ తరంగాలను లోబరచుకొని కమ్యూనికేషన్ పరికరాలను తాయారు చేయడం మొదలుపెట్టారు. సమాచార సిద్ధాంతాన్ని, కమ్యూనికేషన్స్ ను మెళకువగా ముడివేసి కోడింగ్ పరికరాలను, కంప్యూటర్ లను కనుక్కొన్నారు.

మానసిక శాస్త్రము కూడా మనుషులను సాంకేతికతకు లోబడి ప్రవర్తించే జీవులుగా నిర్వచించడానికి ప్రయత్నము చేస్తోంది. ఐరోపా మేధావులు నిత్య కార్యకలాపాలను దృగ్విషయ విశ్లేషణకు గురిచేసారు. మానవ అభివృద్ధి సిద్ధాంతాలను క్షుణ్ణముగా పరీక్షించారు. సామాజిక వాస్తవికతను interactions(సంకర్షణ లేక పరస్పరత) నిర్మిస్తాయి అని నిరూపించే ప్రయత్నము చేసారు.

ప్రస్తుతము,
Bigdata(పెద్ద డేటా) తో  computability లేక గణన శక్తిని
AI(కృత్రిమ మేధస్సు) తో కాంప్లెక్సిటీ లేక (సామజిక) సంక్లిష్టతను
Cloud మరియు Parallel కంప్యూటింగ్ తో concurrency లేక వైజ్ఞానిక పరమైన (ఉభయ) అనుకూలతను
అధిగమించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.


Thursday 13 February 2020

ఆధునిక, సాంకేతిక యుగం - Technological Era - 3 D ప్రింటర్స్ - ఎలక్ట్రానిక్స్ సూత్రాలు - Hardware - Software


ఆధునిక, సాంకేతిక యుగం


మనము ఎలా ఆలోచిస్తున్నాము అన్నది ముఖ్యము కాదు. మనము ఎలా ఉన్నాము అన్నది ఈ ఆధునిక ప్రపంచములో చాలా అవసరము. నువ్వు ఎలా ఉన్నావు అన్నది నిర్ణయించడానికి కొన్నిగుణాలు, లక్షణాలు ఉంటాయి. ఇవి శారీరిక, మానసిక, ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించి ఉంటాయి. జీవ శాస్త్రవేత్తలు మరియు లైఫ్ సైన్సు మేధావులు శరీరము యొక్క పటాన్ని ఏనాడో చిత్రించారు.

వీరు అన్వేషించే విషయాలు ఎన్నో ఉంటాయి. చర్మపు బాహ్య పొర నుంచి అంతరాంతర కేంద్రకాలు మరియు జన్యువుల వరకు విస్తరించి ఉంటాయి. కాని మనుష్యులను ఒక అణు సమూహముగా చిత్రించడం వెఱ్రి కిందే లెక్ఖ. ఈ పద్ధతిని తగ్గింపు వాదం లేక రిడక్షన్ ism అంటారు.

రిడక్షన్ ism గురించి మాట్లాడేటప్పుడు, దాని వ్యతిరేక వాదమైన సంక్లిష్ట వాదం ప్రస్తావన కుడా వస్తుంది. సంక్లిష్టత జీవితాన్నిఎన్నో విధాలుగా వృద్ధి చేస్తుంది. ఈ సంక్లిష్టతను అర్థం చేసుకోలేని వారు దీనిని ఒక శాపములా భావిస్తారు. అజ్ఞానము, అవగాహనలోపము పురోగతికి ఒక గొప్ప అవరోధము.

బాహ్య ప్రపంచములో రణగొణ ధ్వనులు, అతి జనాభా ఎక్కువ అయ్యాయి. శాస్త్ర, సాంకేతిక అభివృద్ధి ఎన్నో నూతన యంత్రాలను ఆవిష్కరించాయి. ఈ యంత్రాలలో ప్రింటర్, ఫోటోకాపీయర్ వంటి స్థూల వస్తువులు ఉంటాయి. సాఫ్ట్వేర్, కంప్యూటర్ ప్రోగ్రామ్స్ వంటి నైరుప్య(ఆబ్స్ట్రాక్ట్) వనరులు కూడా ఉంటాయి.

పారిశ్రామిక యుగానికి, సాంకేతిక యుగానికి తేడాని నిర్ణయించేది ఎలక్ట్రానిక్స్ మాత్రమే. విద్యుత్ శక్తి యాంత్రిక పరికరాలైన క్రేనస్, ట్రక్స్ లను కదిలిస్తాయి. వీటి సహాయముతో కొండలనే కదిలించవచ్చు. ఎలక్ట్రానిక్ భాగాలూ, కంపూటర్లు కూడా పారిశ్రామిక యుగము యొక్క పరిణామాలే. కానీ వాటికీ, ఇతర యంత్రాలకి కొన్ని ఆసక్తికరమైన, నిర్దిష్టమైన వ్యత్యాసాలు ఉన్నాయి.

ఎలక్ట్రానిక్స్ సూత్రాలు మరియు సాఫ్ట్వేర్ చాలా అభివృద్ధి చెంది కొత్త ఆధునికతను, యుక్తిని పొందాయి. కంప్యూటర్లను, ఎలక్ట్రానిక్ పరికరాలను అంతర్జాలముతో అనుసంధానించవచ్చు. వీటిలోని సర్క్యూట్లు, చిప్పులు, ఇంకా ఇతర హార్డువేర్,విద్యుత్ శక్తి తో పని చేస్తాయి. కాకపోతే వీటిలో ప్రవహించే విద్యుత్తే కొత్త రకమైన మాయను సృష్టిస్తోంది. ప్రోగ్రామ్స్, సాఫ్ట్వేర్ కేవలం సున్నాల, ఒకట్ల క్రమము మాత్రమే కాదు - అవి అర్థవంతమైనవి, తార్కికమైనవి మరియు ఉత్పాదకతను పెంపొందిoచేవి కూడా.

ఇప్పుడు ప్రపంచము సాఫ్ట్వేర్ ఉత్పత్తులు, టూల్స్, వేదికలు, మరియు అప్లికేషన్స్ తో సుసంపన్నమైనవి. ఇవి హార్డువేర్, యంత్రాలవలె స్థూల వస్తువులు కావు. ఇవి డేటా, సమాచారము, ఇంకా కోడ్ యొక్క నైరుప్య సేకరణలు(abstract కలెక్షన్స్). ఐతే, సాఫ్ట్వేర్ రెండు విభిన్న స్థితులలో మనుగడ కొనసాగిస్తాయి.
1.      ఒకటి స్థిరమైన స్థితి - హార్డ్ డిస్క్ లాంటి భౌతిక మాధ్యమములో పొందుపరచడము
2.      రెండు డైనమిక్ స్థితి - కంప్యూటర్ మెమరీ లోని ప్రోగ్రామ్స్, డేటా మరియు వాటి మీద చేయబడే ప్రాసెసింగ్(ఇది మైక్రోప్రాసెసర్ అనబడే భౌతిక వస్తువుతో చేయబడుతుంది)

కాబట్టి, హార్డువేర్ మరియు భౌతిక మాధ్యమాలు ఎక్కడ అంతమై, నైరుప్య పధ్ధతి ఎక్కడ మొదలౌతుందో చెప్పడం చాలా కష్టం. హార్డువేర్, సాఫ్ట్వేర్ల వ్యత్యాసాన్ని జ్ఞానేంద్రియాల ద్వారా గుర్తించవచ్చు. స్థూలమైన పరికరాలను మనము చూడొచ్చు, ముట్టుకోవచ్చు, వాటి వాసన పసిగట్టవచ్చు. సాఫ్ట్వేర్ దీనికి విరుద్ధమైనది. దానిని మనము కంటితో చూడలేము. కేవలము దాని యొక్క ప్రభావాలను ఔట్పుట్, డేటా, ఫలితాల రూపములో చూడొచ్చు.

కాకపోతే ఇప్పుడు బాగా అభివృద్ధి చెందిన 3 D ప్రింటర్స్ వచ్చేసాయి.  వీటిని సంకలిత తయారీ పరికరాలు లేక additive manufacturing devices అంటారు. ఈ సాధనాలను కంప్యూటర్స్ తో కనెక్ట్ చేసి రకరకాల నూతన వస్తువులను తయారీ చెయ్యొచ్చు. ఈ వస్తువులకు రకరకాల పరిమాణాలు, ఆకారాలు, రంగులు ఇవ్వొచ్చు
ఈ 3 D ప్రింటర్ లేక తయారీ పరికరము, కంప్యూటర్ నుంచే ఆదేశాలను స్వీకరిస్తుoది. పరిజ్ఞానము ఉన్నవాళ్లు కంప్యూటర్ లోనే నూతన వస్తువుల నమూనాల రూపకల్పన చేస్తారు. 3 D ప్రింటర్ పొరలు పొరలుగా భౌతిక పదార్థాన్నిజోడించి ఆ నమునాకు జీవం పోస్తుంది.

తత్త్వశాస్త్ర దృష్టితో చూస్తే, జీవితము, పథార్థ క్షేత్రములో,  ఒక ప్రదక్షిణ పూర్తి చేసినట్టే.  పథార్థము తో నిర్మించిన వస్తువులను (కంప్యూటర్స్) ఉపయోగించి, అధునాతన వస్తువులను సృష్టించడం జరుగుతోంది. తయారీ ప్రక్రియలో మానవ పాత్ర కుచించుకు పోయింది.

ఈ యుగాన్ని, ఈ అభివృద్ధి పథాన్ని రకరకాల పేర్లుతో పిలుస్తున్నారు. 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పోస్ట్-ఇండస్ట్రియల్ సొసైటీ, knowledge(జ్ఞానవంతమైన) ఎకానమీ, డేటా-driven డెవలప్మెంట్, Internet అఫ్ Things (IoT) etc.,   


Wednesday 12 February 2020

Knowledge Economy - జ్ఞానవంతమైన ఆర్థికవ్యవస్థ - జ్ఞానముతో కూడిన సామాజిక ఆర్థిక వ్యవస్థ


జ్ఞానవంతమైన ఆర్థికవ్యవస్థ (Knowledge Economy)

ప్రపంచీకరణ మరియు అర్థిక పురోగతి ఒక నవీన ప్రపంచాన్నిఆవిష్కరిస్తోంది. కంప్యూటర్లు రాక ముందు, పెద్ద, పెద్ద పరిశ్రమల ప్రభావము ఎక్కువగా ఉండేది. సాఫ్ట్వేర్ అవిర్భావముతో చిన్న మరియు మధ్య స్థాయి పరిశ్రమలు కూడా విస్తరించాయి. ఇప్పుడు సాంకేతిక, సమాచార విప్లవాలు ఒక నూతన జ్ఞానవంతమైన ఆర్థిక వ్యవస్థను ప్రేరేపిస్తున్నై.

ఈ జ్ఞానవంతమైన ఆర్థిక వ్యవస్థను మూడు విభాగాలుగా గుర్తించవచ్చు - 
1.      సాంకేతిక పరమైన ఆర్థిక వ్యవస్థ
2.      జ్ఞానవంతమైన ఆర్థిక వ్యవస్థ
3.      జ్ఞానముతో కూడిన సామాజిక ఆర్థిక వ్యవస్థ

సాంకేతిక పరమైన ఆర్థిక వ్యవస్థ


ఈ వ్యవస్థలోని సంస్థలు సమాచార మరియు కమ్యూనికేషన్స్ సాంకేతికతపై (ICT) ఆధారపడి ఉన్నాయి. ఇందులో ఇంటర్నెట్, మొబైల్ టెలిఫోనీ, కంప్యూటర్స్, మరియు సాఫ్ట్వేర్ ల ప్రభావముఎక్కువగా కనపడుతుంది. సాంకేతిక వ్యవస్థాపకులు మరియు వ్యాపారులు, ICT ని ఉపయోగించి సమస్యలకు సమాధానాలు కనుక్కొంటారు. 
వీరు నాలుగు ముఖ్యమైన పనులు చేస్తారు -
  • 1      నూతనంగా ఉద్భవిస్తున్నసాంకేతికతలను(emerging టెక్నాలజీస్) వ్యాపార దృకపధంతో ఉపయోగించుకోవడము.
  • 2      నవీకరణ ద్వారా సాంకేతిక మార్పులను ప్రేరేపించడము.
  • 3      ఊహశాక్తితో సాంకేతిక పరమైన ప్రక్రియలను, వ్యాపార నమూనాలనుప్రయోగించి మార్కెట్ అవకాశాలను చేజిక్కించుకోవడము.
  • 4      నూతన సాంకేతిక వ్యవస్థలను, వ్యాపారాలను పకడ్బందిగా ఏర్పాటు చేసుకోవడము.
జ్ఞానవంతమైన ఆర్థిక వ్యవస్థ

డేటా మరియు సమాచారాన్నిశక్తివంతమైన జ్ఞానముగా మార్చగలిగే వ్యవస్థలదే భవిష్యత్తు. నవీన వ్యవస్థాపకుల మేధస్సే ఇందులో ముఖ్య పెట్టుబడి. సాంకేతిక పరమైన ఆర్థిక వ్యవస్థ సమాచారాన్నిసృష్టిస్తే, ఈ వ్యవస్థ ఆ సమాచారాన్నించి ఉపయోగకరమైన జ్ఞానాన్నిసృష్టిస్తుంది. సాంకేతిక పరమైన ఆర్థిక వ్యవస్థ, జ్ఞానవంతమైన ఆర్థిక వ్యవస్థలో ఒక భాగము మాత్రమే.

ఇందులో వ్యవస్థాపకులు, మానవ మూలధనాన్ని మరియు ICTని తెలివిగా ఉపయోగించుకొని లబ్ధి పొందుతారు. ఎన్ని పరికరాలు, యంత్రాలు, సాంకేతికాలు ఉన్నా, మానవ మేధస్సులేనిదే గొప్ప విజయాలు సాధించడము సాధ్యము కాదు. ఈ వ్యవస్థలో ఆలోచనలు,సమాచారము, మరియు జ్ఞానము సమ్మిళితమై ఉంటాయి.

ఈ వ్యవస్థ విజయము సాధించాలంటే, అధునాతనమైన మరియు మౌలికమైన సదుపాయాలు ఏంతో అవసరము. వీటిలో టెలికాం మరియు సమాచార వ్యవస్థల (Information System) పాత్ర ముఖ్యమైనది. వీటికి తోడు కొన్ని ముఖ్యమైన ఆవిష్కరణల పాత్ర కూడా చెప్పుకో తగ్గది. అవి కృత్రిమ మేధస్సు(AI), రోబోటిక్స్, అంతర్జాలము, ఇఒటి(I o T), బ్లోక్చైన్, క్వాంటమ్ కంప్యూటింగ్, 3D ప్రింటింగ్, 5జి కమ్యూనికేషన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, etc.  

జ్ఞానముతో కూడిన సామాజిక ఆర్థిక వ్యవస్థ

ఆర్ధికాభివృద్ధి సమాజములోని సమస్యలను తీర్చలేదని తేలిపోయింది. పేదరికము, పర్యావరణ కాలుష్యము, పేలవమైన విద్యా వ్యవస్థ, నిరుద్యోగము, ఇలా చెప్పుకుంటూపొతే చాలా సమస్యలే ఉన్నాయి. సాంకేతిక అభివృద్ధి, డిజిటల్ విభజనను (digital divide) కూడా పెంచి పోషించింది. ఈ పరిస్థితులలో కేవలము సమాచారము మరియు సాంకేతికత మాత్రమే సరిపోవు. జ్ఞానముతో కూడిన సమాజాన్ని ఆవిష్కరించడమే ఈ ఆర్థిక వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యము.

జ్ఞానవంతమైన ఆర్థిక వ్యవస్థ వ్యాపారులకు కేంద్రమైతే, జ్ఞానముతో కూడిన సామాజిక ఆర్థిక వ్యవస్థ సమాజ సేవకులకు, ప్రభుత్వాలకు ఉపయోగపడుతాయి. ప్రభుత్వేతర సంస్థలు(NGOs) కూడా ఈ వ్యవస్థలో ముఖ్య పాత్ర నిర్వహిస్తాయి. సామజిక వ్యవస్థాపకులు(social entrepreneurs) ఈ వ్యవస్థకు పట్టుకొమ్మగా నిలుస్తారు.


Wednesday 1 August 2018

సాధారణ తెలుగు బ్లాగ్

ముందుమాట

ఆధునికి విద్య, విజ్ఞానం మీద మాతృభాష అయిన తెలుగులో వ్రాయాలని ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఒక గ్రంథాలయ సంచాలకులు నాకు ఈ సలహా ఇచ్చారు.

గూగుల్ మరియు అనేక మంది విజ్ఞానవేత్తల శ్రమ వలన ఈనాడు మనకు అనేక  అనువాద పరికరాలు ఉన్నాయి.  ఆంగ్లములో నుంచి తెలుగులోకి  అనువదించడానికి ప్రత్యేక శ్రమ అవసరంలేదు.

కొన్ని సంవత్సరాల క్రితం వరకు  అనువాదము చేయడానికి డీటీపీ ప్రత్యేక సాఫ్ట్  వేర్ అవసరం అయ్యేది. నాకు ఇప్పటికి గుర్తు - ఒక చిన్న శ్లాఘనీయ పద్యము (eulogy) అనువదించడానికి అరగంట నుంచి గంట దాకా పట్టేది.

నా విద్యాభ్యాసము అంతా ఆంగ్ల భాష లోనే జరిగింది. తెలుగులో నాకు ప్రత్యేకమైన ప్రావీణ్యము లేదు. దిన పత్రిక తప్ప పుస్తకాలూ పెద్దగా చదవలేదు. వ్యావహారిక లేక వాడుక భాష తప్ప గ్రాంథిక భాష పై పట్టూ  లేదు.

నా ఆలోచనలు ఆంగ్ల విద్య, ఆధునిక కంప్యూటర్ పద్ధతుల వరకే పరిమితం. వాటినే తెలుగులో వ్రాత పూర్వకముగా (టైపు చేసి) వ్యాఖ్యానించడానికి ప్రయత్నం చేస్తాను.

ధన్యవాదాలు!